వేదోద్ధరణకై శ్రీ మహా విష్ణువు మత్స్యావతారం స్వీకరించినప్పుడు ప్రళయ సముద్ర జలాలు భూలోకాన్ని ముంచి వేయబోయాయి.అప్పుడు శ్రీహరి ప్రేరణతో ఒక నావ అక్కడకు వచ్చింది. సత్యవ్రతుడు దానిపై పెక్కు ఓషధుల విత్తనాలను అమర్చాడు. మహా మీనంగా ప్రత్యక్షమైన విష్ణువును చూసి సంతోషించి సత్యవ్రతుడు ఋషులతో పాటు ఆయనను ఇలా స్తుతించాడు.
తమలో బుట్టు నవిద్య గప్పిగొనుడుం దన్మూల సంసార వి
భ్రములై కొందరు దేలుచుం గలగుచున్ బల్వెంటలన్ దైవ యో
గమునం దే పరమేశు గొల్చి ఘనులై కైవల్య సంప్రాప్తులై
ప్రమదంబందుదు రట్టి నీవు కరుణం బాలింపు మ మ్మీశ్వరా!
భావం: ఓ భగవంతుడా! తమలో ఆవరించి ఉన్న అఙ్ఞానం వల్ల కొందరు సంసారంలో పడి చిక్కుకుని మోసపోయి కలత పడతారు. కోరికలను వెన్నంటుతారు. అటువంటి వారు అదృష్టం వల్ల పరమత్ముడవైన నిన్ను సేవించి మోక్షాన్ని పొంది సంతోష పడతారు. ఆ విధంగా అందరినీ ఆదరించే నీవు మమ్ములను కాపాడు.
కన్నులు గల్గు వాడు మరి కానని వానికి ద్రోవ జూపగా
జన్న తెరంగు మూఢునకు సన్మతి దా గురుడౌట సూర్యుడే
కన్నులు గాగ భూతముల గాంచుచు నుండు రమేశ! మాకు ను
ద్యన్నయ మూర్తివై గురువవై యల సద్గతి జాడ జూపవే!
భావం: ఓ లక్ష్మీపతీ! సూర్యుడే కన్నులుగా నీవు ప్రాణులను చూస్తుంటావు. ఙ్ఞానం లేని వారికీ, దుర్బుద్ధి కలవానికీ తండ్రివి నీవే. కాబట్టి కనులున్న వాడు కనులు లేని వానికి దారి చూపించిన విధంగా మమ్ములను ఉద్ధరించు. గురుడవై మాకు మంచి దారి చూపించు.
ఇంగలము తోడి సంగతి,
బంగారము వన్నె కలుగు భంగిని ద్వత్సే
వాంగీకృతుల యఘంబులు,
భంగంబుల బొందు ముక్తి ప్రాప్తించు హరీ!
భావం: ఓ స్వామీ! అగ్నితో చేరడం వల్ల బంగారానికి మెరుగు కలిగిన విధంగా నిన్ను పూజించే భక్తుల పాపాలు నాశనమై మోక్షం లభించుతుంది.
హృదయేశ! నీ ప్రసన్నత,
పదివేలవ పాలి లేశ భాగము కతనం
ద్రిదశేంద్రత్వము కలదట!
తుది నిను మెప్పింప నేది దొరకదు శ్రీశా!
భావం: ఓ లక్ష్మీ రమణా! పరమత్మా! నీ అనుగ్రహంలో పదివేలవ వంతులో ఒక లేశ భాగం వల్ల దేవేంద్ర పదవి కలుగుతుంది. ఇక నీకు మెప్పు కలిగిస్తే లభించని భాగ్యమేముంటుంది?
పెరవాడు గురుడటంచును
కొరగాని పదంబు సూప కుజనుండగు నీ
నెర త్రోవ నడవ నేర్చిన
నరమర లేనట్టి పదమునందు దయాబ్ధీ!
భావం: ఓ దయా సముద్రుడా! పనికిమాలిన వానిని గొప్ప వాడనుకొని దరి చేరే వాడు చెడిపోతాడు. నిన్ను నమ్ముకుని మంచి మార్గంలో నడవగలిగిన వారు సందేహం లేకుండా నీ సంరక్షణ పొందుతారు.
చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై యాత్మవై
వలనై కోర్కుల పంటవై విభుడవై వర్తిల్లు నిన్నొల్లకే
పలు వెంటంబడి లోక మక్కట! వృథా బద్ధాశమై పోయెడిన్
నిలువన్ నేర్చునె హేమరాశి గనియున్ నిర్భాగ్యుడంభశ్శయా!
భావం: నీటియందు శయనించు వాడవైన నారాయణా! నీవు స్నేహితుడుగా బంధువుగా ఙ్ఞాన స్వరూపుడుగా శాశ్వతునిగా మానవుల మనస్సులలోనే మసలుతావు. ఆత్మవై అండగా ఉంటావు. ప్రభువై కోరికలు పండిస్తావు. ప్రభునిగా రక్షించి వర్తించువాడవైన నిన్ను ఆదరించకుండా లోకం పెక్కింటిపై పేరాసతో పరుగులు పెడుతుంది. అదృష్ట హీనుడు బంగారు రాశి లభించినా దక్కించుకోలేడు కదా!

No comments:
Post a Comment