ఒక సారి బ్రహ్మ దేవుడు శ్రీ కృష్ణుని బాల్య లీలలలకు, ఆతని రాక్షస సంహారగాధలకు అబ్బుర పడి ఆ చిన్ని కృష్ణుని మరింత పరీక్షించ దలచి ఆయన లేగలనూ, గోప బాలురనూ మాయం చేసేస్తారు. అప్పుడు కృష్ణుడే వారందరి రూపాలనూ తాను ధరించి వారి వారి ఇళ్ళకు చేరుకుంటాడు. అలా సృష్టికి ప్రతిసృష్టి చేసి తన ఉనికితో అందరికీ మరింత ఆనందం కలుగ చేస్తాడు ఆ సర్వాంతర్యామి. ఒక సంవత్సరం గడిచింది. తన మూఢత్వంతో తానే విష్ణు మాయకు వశుడయ్యానని గ్రహించిన బ్రహ్మ నాల్గు ముఖాలతోనూ స్వామిని ఇలా స్తుతించారు:
శంపాలతిక తోడి జలదంబు కైవడి మెరుగు టొల్లియ తోడి మేనివాని
కమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాణ వేణు చిహ్నంబులు వెలయువాని
గుంజా వినిర్మిత కుండలంబుల వాని శిఖిపింఛ వేష్టిత శిరము వాని
వన పుష్ప మాలికా వ్రాత కంఠము వాని నలిన కోమల చరణముల వాని
గరుణ గడలు కొనిన కడగంటి వాని గో
పాలబాలు భంగి బరగు వాని
నగు మొగంబు వాని నను గన్న తండ్రిని
నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష!
భావం: మెరుపు తీగతో కూడిన మేఘం వలె శరీరం బంగారు రంగు పట్టు పచ్చడపు ఉత్తరీయంతో కూడిన నల్లని దేహంతో ప్రకాశిస్తున్నది. చేతిలో ఉన్న చలిది ముద్ద మృదువుగా, అందంగా ఉండగా, వెదురు కర్ర, కొమ్ము బూర, మురళి మొదలైన వాటితో ప్రకాశిస్తూ ఉన్న వానిని, గురిగింజలతో చేయబడిన కుండలాలు, శిరస్సుపై చుట్టుకొనబడిన నెమలి పింఛం, అడవి పువ్వుల మాలికతో అలంకరించబడిన కంఠం, తామర పువ్వుల వలె సున్నితములై ఎంతో అందంగా ఉన్న పాదాలు, దయా రసం పొంగి పారుతూ చూస్తున్న కడకంటి చూపును, గోపాల బాలుని రూపాన్ని బ్రహ్మ స్తుతిస్తూ ఉంటే ఆయనను చూసి నవ్వుతున్న బాలకృష్ణుని ముఖం చాలా రమణీయంగా ఉంది. కమల దళాల వంటి కన్నులు గల నన్ను కన్న తండ్రివైన శ్రీహరీ ! ఇప్పుడు నిన్ను గుర్తించాను. నీకు మ్రొక్కి నిన్ను సేవించుకుంటున్నాను.
నను మన్నించి భవజ్జనంబులకు నానందము నిండించు నీ
తను రూపంబిదె నా మనంబున కచింత్యంబయ్యె, నీ యుల్లస
ద్ఘన విశ్వాకృతి నెవ్వడోపు? నెరుగం గైవల్యమై యొప్పు నా
త్మ నివేద్యంబగు నీదు వైభవము చందం బెట్టిదో ఈశ్వరా!
భావం: ఈశ్వరా! నన్ను అనుగ్రహించు. నీ జనులకు అందరకూ ఆనందం నిండించే నీ ఈ చిన్న రూపమే నా మనస్సుకు ఊహించడానికి సాధ్యం కాకపోయింది. నీవు ఉల్లాసంతో ధరించిన మహా విశ్వ రూపాన్ని తెలుసుకోవడానికి సమర్థులు ఎవ్వరూ లేరు. నీ రూపం నీ రూపమే. నాలో "నేను" గా నున్న నీకు మాత్రమే తెలియదగిన నీ వైభవం ఎంత విశేషమైనదో ఎవరికిని తెలియదు.
విఙ్ఞాన విధము లెరుగక
తద్ ఙ్ఞులు నీవార్త చెప్ప తను వాఙ్ఞనముల్
యఙ్ఞేశ! నీకు నిచ్చిన
యఙ్ఞులు నిను బట్టి గెలుతు రజితుడవైనన్
భావం: యఙ్ఞ కర్తవై ఒప్పునట్టి ఓ స్వామీ! నీవు అఙ్ఞానుల చేత తెలియుటకు అలవి కాని వాడివైనా, విఙ్ఞానము గల మహనీయులు నీ స్వరూపము ఇట్టిది, అట్టిది అని బోధించగా, విని, మనోవాక్కాయములను నీకు సమర్పించి వర్తించే మూఢులు, నీవు తెలుసుకొనలేని వాడవైనా కూడా నిన్ను తెలుసుకొని బ్రహ్మానంద సముద్రంలో ఓలలాడుతుంటారు.
శ్రేయములు గురియు భక్తిని
జేయక కేవలము బోధ సిద్ధికి దపముం
జేయుట విఫలము, పొల్లున
నాయము సేకురునె తలప నధికంబైనన్
భావం: భక్తి అనేది సర్వ శుభాలనూ వర్షిస్తుంది. అటువంటి శక్తిని వదిలి పెట్టి కేవలం ఙ్ఞానం కోసం తపస్సు చెయ్యడం వ్యర్థం. ఎంత ఎక్కువగా కూడబెట్టినా బియ్యం పైన ఉండే ఊక వలన ఏమి ఆదాయం వస్తుంది?
జల చర మృగ భూసుర నర,
కులముల జన్మించితీవు కుజనుల జెరుపం
జెలిమిని సుజనుల మనుపను
దలపోయగ రాదు నీవిధంబులనంతా!
భావం: ఆది, అంతం లేని ఓ మహానుభావా! నీవు దుర్మార్గులను శిక్షించాడానికీ, సజ్జనులను ప్రేమతో రక్షించడానికీ జల చరములుగా (మత్స్యావతారము), మృగములుగా (వరాహావతారము), బ్రాహ్మణులుగా (వామన, పరశు రామ), సాధారణ మానవులుగా (శ్రీ రామ కృష్ణావతారములను) ఎన్నో అవతారాలు ఎత్తావు. నీ మార్గాలు బహు విధాలుగా ఉంటాయి. వాటిని ఈ విధాలుగా ఉంటాయని ఊహించడం సాధ్యం కాదు. నీ వలెనే నీ మార్గాలు కూడా అనంతాలే.
ఏలా బ్రహ్మ పదంబు? వేదములకున్ వీక్షింపగా రాని ని
న్నీ లోకంబున నీ వనాంతరమునం దీ మందలో గృష్న యం
చాలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు నీ
వ్రేలం దొక్కని పాదరేణువులు పై వేస్టించినం చాలదే?
భావం: ఈ భూలోకంలో, ఈ అడవిలో, ఈ గొల్ల వారి ఇండ్లలో సంచరించేవాడవు, వేదముల చేత కూడా ఇలాంటి వాడు అని విశదంగా తెలుసుకోవడానికి అలవి కాని వాడివి అయిన నిన్ను కృష్ణా! రా అని నీతో ముచ్చట్లు ఆడటం,నిన్ను చూడటం, నీ మాటలు వినడం మొదలైన పనులకు కారణాలైన పదహారు ఇంద్రియాలకూ రాజైన మనస్సును అనన్య భక్తితో నీయందే చేర్చిన ఈ గోపకులలో ఒక్కని కాలి దుమ్ము నలుసులు మీద సోకేటట్లు మెలిగినా చాలును. అంతకంటే బ్రహ్మ అనే ఒక అధికార స్థానము పొంది ఉండుట యేలా? అది హెచ్చు విషయమే కాదు.

No comments:
Post a Comment