Thursday, September 7, 2017

శ్రీ మోమారమణ దశశ్లోకీ స్తుతి -అప్పయ్య దీక్షిత కృతం

మారమణ ముమా రమణం ఫణధర తల్పం ఫణాధరాకల్పం
మురమథనం పురమథనం వందే బాణారిమసమ బాణారిం           1

గోనయన మిలానయనం రవి శశినయనం రవీందు వహ్నచక్షం
స్మర తనయం గుహతనయం వందే వైకుంఠ ముడుప మూర్థానం 2

కృష్ణతను ముమార్థ తనుం జలనిధి శయనం సుమేరుశృంగస్థం
దశవపుషం వసువపుషం వందే భూజాని మచల భూజానిం             3

క్రుధ్నధర ముదగ్ని ధరం జలజాకాంతం జటాగజాకాంతం
గరుడరథం వృషభరథం వందే పంచాస్త్ర మఖిల దిగ్వస్త్రం           4

బ్రహ్మ సుత మృగాదినుతం గజగిరివాసం గజేంద్ర చర్మాంగం
సురశరణం హరిశరణం వందే భూదార మఖిలభూతేశం                  5

పార్థసఖ ముపాత్తమఖం జలధరకాంతిం జలంధరారాతిం
విధివినుతం హరివినుతం వందే నీలాభం సుగలనీలాభం              6

పీతపట మరుణజటం పరిమలదేహం పవిత్ర భూత్యంగం
జలజకరం డమరుకరం వందే గోపాలమఖిలగోనాథం                      7

చక్రకర మభయకరం మణిమయభూషం ఫణామణీభూషం
శాఞ్గ ధనుషం గిరిధనుషం వందే గోవింద మనఘ గోవాహం            8

నరసూతం నారిసూతం జలజపదాభం జలేశపాపఘ్నం
ధ్వజగరుడం ధ్వజ వృషభం వందే వామాంగ మిహిర దక్షాంగం       9

ఖడ్గధర మురుకటకం కమల కరాభం కలేశ వస్త్రాభం
స్మితవదనం సుమవదనం వందే రక్షోఘ్న మరుణ దంతఘ్నం      10

నిద్రాతు వా నృత్యతువాధిగంగం గరుత్మతాయాతు కకుద్మతావా
న వస్తు బేధ ప్రతిపత్తిరస్తి మే తథాపి భక్తిస్తరుణేందు శేఖరే              11



   

1 comment:

  1. అయ్యా దయచేసి శివగద్యం ఉంటే పెట్టవలసినది గా ప్రార్ధన.టేకుమళ్ల శ్రీనివాసరావు

    ReplyDelete